Pawan Kalyan | క్రేజీ కాంబినేషన్ సెట్ చేసిన పవన్ కళ్యాణ్.. ఆ డైరెక్టర్‌తో పొలిటికల్ థ్రిల్లర్?
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన మాస్ ఇమేజ్‌ని చూపించాడు. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ అభిమానులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది.
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన మాస్ ఇమేజ్‌ని చూపించాడు. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ అభిమానులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది.ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ తన తదుపరి ప్రాజెక్ట్‌లపై ఆసక్తికరమైన వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆయన 33వ చిత్రానికి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ వెలుగులోకి వచ్చింది. వైవిధ్యభరితమైన కథలతో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు దేవా కట్టాతో పవన్ కళ్యాణ్ చేతులు కలపబోతున్నారనే వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
‘ప్రస్థానం’, ‘ఆటో నగర్ సూర్య’, ‘రిపబ్లిక్’ వంటి రియల్, సీరియస్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దేవా కట్టా, ఈసారి పవన్ కళ్యాణ్ కోసం ఒక పవర్ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథ ఇప్పటికే లాక్ అయ్యిందని, ప్రాథమిక చర్చలు కూడా పూర్తయ్యాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయ ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలను ప్రతిబింబించేలా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటికే దర్శకుడు సురేందర్ రెడ్డితో ఒక భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రం కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ ఈ రెండు ప్రాజెక్ట్‌లను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఒకవైపు పొలిటికల్ థ్రిల్లర్, మరోవైపు కమర్షియల్ ఎంటర్టైనర్తో అభిమానులను అలరించేలా పవన్ స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, రాబోయే సినిమాలతో వెండితెరపై మరింత సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. అభిమానులు కూడా ఈ కొత్త కాంబినేషన్స్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

