Pawan Kalyan-Sai Dharam Tej Poster | గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెగ బిజీ అయిపోయాడు. వారానికో సెట్లో దర్శనమిస్తూ చక చక షూటింగ్‌లను కంప్లీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. అందులో ‘వినోదయ సిత్తం’ రీమేక్ ఒకటి. బ్రో మూవీ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పవన్ లుక్కు అభిమానులు ఓ రేంజ్లో సంబురాలు చేసుకుంటున్నారు. చాలా కాలం తర్వాత పవన్‌లో యాటిట్యూడ్, స్టైల్, స్వాగ్ ఇలా మూడింటి కలబోతతో లుక్‌ను చూశామని చిత్రబృందంపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. ఇక ఇటీవలే రిలీజైన సాయితేజ్ పోస్టర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా చిత్రబృందం మామా అల్లుళ్లు కలిసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. బైక్‌పై కాలుపెట్టిన పవన్, పవన్ వెనుకాల సాయిధరమ్ ఉన్న పోస్టర్ అదిరిపోయింది. క్లాస్సీ లుక్‌లో మామా అల్లుళ్ల దర్శనం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది. నిన్న, మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేని సినిమాపై గత వారం, పది రోజులుగా వరుస పోస్టర్లు రిలీజ్ చేస్తూ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చారు. ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్ర పోషించగా.. సాయి తేజ్ మార్క్ అనే యువకుడి పాత్రలో నటిస్తున్నాడు.
Here’s the 1st Peek at #BroTheAvatar Combo that’ll set the screens ablaze on July 28th 🤙🔥 #BROTheDuo 💥@PawanKalyan & @IamSaiDharamTej 🤩@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @bkrsatish @TheKetikaSharma@NavinNooli @ZeeStudios_ @zeestudiossouth… pic.twitter.com/B2bwd8rPQo
— People Media Factory (@peoplemediafcy) May 29, 2023
ఒక యాక్సిడెంట్లో చనిపోయిన ఓ వ్యక్తి.. తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, దానికి మూడు నెలలు సమయం కావాలని తననీ పైకి తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని ఓ వరం అడుగుతాడు. దానికి దేవుడు ఒప్పుకోవడమే కాకుండా ఆ మూడు నెలలు ఇక్కడే ఉండి ఆ వ్యక్తితో ప్రయాణిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి తాను అనుకున్న పనులను పూర్తి చేశాడా? అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సముద్రఖనీ రీమేక్ వెర్షన్‌ను కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడు.