Pawan Kalyan| ఏపీ డిప్యూటీ సిఎంగా కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ పేరు వింటే అభిమానులకి ఎంత పూనకం వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్‌ని ఆయన అభిమానులు ఎంతగానో అభిమానిస్తుంటారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజవుతుందంటే ఆ రోజు ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. భారీ భారీ కటౌట్లతో, ఫ్లెక్స్‌లతో థియేటర్లను నింపేసి పండగ వాతావరణం సృష్టింస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో సినిమాలు చేయడం చాలా కష్టం అవుతుంది. గతంలో కమిట్ అయిన సినిమాలని పూర్తి చేయడమే పెద్ద సమస్యగా మారింది.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కొత్త సినిమాలు చేస్తారా చేయరానే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఇటీవల సభలో రాజకీయాలు, సామజిక సేవ, ప్రజా క్షేమమే తన ప్రాధాన్యతలని నొక్కి మరీ చెప్పడంతో అందరికి ఓ క్లారిటీ వచ్చేసింది. అదీ కాక జనసేన ఆవిర్భావ దినోత్సవంలో అభిమానులు ఓజి ఓజి అని అరుస్తూ ఉంటే కార్యకర్తల గౌరవం కోసం ఎలాంటి నినాదాలు చేయొద్దని పవన్ అంటుంటే ఆయనకి సినిమాలపై ఇంట్రెస్ట్ తగ్గినట్టు అనిపిస్తుందని కొందరు చెప్పుకొస్తున్నారు.
పవన్ నటించిన హరిహర వీరమల్లు మేలో విడుదలయ్యాక ఈ సంవత్సరం లేదా వచ్చే ఏడాది ఓజితో పవన్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కొత్త కథలు అయితే వినడం లేదు. గతంలో సురేందర్ రెడ్డితో అనుకున్న ప్రాజెక్టు సైతం ముందుకెళ్లేలా కనిపించడం లేదు. చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ జరిగిన కూడా గొప్పే. గతంలో అజ్ఞాతవాసితో సినిమాలు ఆపేసి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటానని చెప్పిన పవన్ ఆ తర్వాత ఓటమి, పార్టీ నడపడానికి నిధులు అవసరం కావడంతో తిరిగి సినిమాలు చేశారు. కాని ఇప్పుడు పవన్ బిజీ షెడ్యూల్స్‌తో సినిమాలు చేసే అవకాశం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో