Ustad Bhagathsingh Movie | పదేళ్ల క్రితం వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో హిట్టయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏన్నో ఏళ్లుగా హిట్టు కోసం పరితపిస్తున్న పవన్‌కు ఈ సినిమా తిరుగులేని విజయం సాధించింది. అభిమానే దర్శకుడై సినిమా తీస్తే ఏ రేంజ్లో ఉంటుందో హరీష్ శంకర్ నిరూపించాడు. ఈ సినిమాతో పవన్ ఫ్యాన్స్ అందరూ హరీష్ శంకర్‌కు కూడా ఫ్యాన్స్ అయిపోయారు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. కాగా మళ్లీ ఈ కాంబో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.
ఎట్టకేలకు రెండేళ్ల క్రితం భవదీయుడు భగత్‌సింగ్ సినిమాను అనౌన్స్ చేశారు. ఆ క్షణం పవన్ ఫ్యాన్స్ సంతోషం మాటల్లో వర్ణించలేనిది. అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.. అప్పుడు స్టార్ట్ అవుతుందని క్యాలెండర్ డేట్స్ మారుతున్నాయే తప్ప ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం లేదు. దాంతో ఒకనొక టైమ్‌లో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని వార్తలు జోరందుకున్నాయి. అయితే ఇటీవలే పేరు మార్చి ఉస్తాద్ భగత్‌సింగ్ టైటిల్‌తో మరో ప్రకటన వచ్చింది. అయితే అది తేరీ రీమేక్ అని రూమర్స్ రావడంతో పవన్ ఫ్యాన్స్ సైతం ట్విట్టర్లో రచ్చ చేశారు. ఇప్పటికే వందల సార్లు చూసేసిన సినిమాను రీమేక్ ఎలా చేస్తున్నారంటూ హరీష్ శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీష్ శంకర్ ఆ మధ్య ఈ సినిమా తేరీ రీమేక్ కాదని వివరణ ఇచ్చాడు. అయినా కానీ రచ్చ ఆగలేదు. దాంతో చేసేదేమి లేక హరీష్ శంకర్ కూడా సైలెంట్ అయిపోయాడు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. తాజాగా పవన్ సెట్స్‌లోకి అడుగుపెట్టాడు. కాగా సెట్స్‌లో నుంచి పవన్‌కు సంబంధించిన లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫొటోలో పవన్ లైట్ గడ్డంతో లుంగీ కట్టులో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోపై పవన్ అభిమానులు.. మాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే మరికొందరు మాత్రం భీమ్లా నాయక్ లుక్లానే కనిపిస్తందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా కోసం పవన్ 50రోజులు కాల్షీట్లు మాత్రమే ఇచ్చాడని తెలుస్తుంది. దాంతో చిత్రయూనిట్ షూటింగ్‌ను పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నారట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
This pic from #UstadBhagathSingh
Harish anna sambavam loading 💥💥🔥 pic.twitter.com/SJSf2lgo3p
— 💥SUJEETH’sOG💥 (@AmarnadhDasam) April 8, 2023