సినిమాలు, రాజకీయాలను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయడమంటే కష్టమైన పనే. కానీ ఓ వైపు అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించే పనిలో ఉంటూనే.. మరోవైపు ప్రజా సమస్యలపై పోరాడుతూ తీరిక లేకుండా ఉన్నారు సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఇప్పటికే ఎన్నికల ప్రచార రథం వారాహిపై రోడ్ షో ప్లాన్ సిద్దం చేసుకున్న పవన్ కల్యాణ్.. ఎవరూ ఊహించని విధంగా తాత్కాలికంగా నిలిపేశాడు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కూడా సంతకం చేశాడు.
ఈ స్టార్ హీరో ప్రస్తుతం వినోధయ సీతమ్ రీమేక్, హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu), సుజిత్ దర్శకత్వంలో ఓజీ (OG), హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాలు చేస్తున్నాడు. వీటిలో అన్నిటికంటే మొదటగా రావాల్సిన చిత్రం క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహరవీరమల్లు. చాలా కాలం క్రితం మొదలైన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తయి.. థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ పొలిటికల్ కమిట్ మెంట్స్ కారణంగా అనుకున్న సమయానికి రాలేకపోయింది.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం తను కమిట్ అయిన సినిమాలన్నింటికి న్యాయం చేసేలా పక్కాగా సమ్మర్ ప్లాన్ చేసుకున్నాడన్న వార్త ఇపుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. సముద్రఖని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్‌తో పవన్ కల్యాణ్ కలిసి నటిస్తున్న చిత్రానికి దేవుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు టాక్. కాగా ఈ సినిమా కోసం మార్చిలో పవన్ కల్యాణ్ 15-20 రోజులు డేట్స్ ఇవ్వబోతున్నాడట.
ఆ తర్వాత ఏప్రిల్‌లో హరీష్ శంకర్‌తో చేయబోయే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ 10 రోజుల కాల్షీట్లు ఇవ్వనున్నాడని టాక్. అనంతరం ఓ వారంపాటు రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సుజిత్ డైరెక్షన్లో చేస్తున్న OG సినిమాకు డేట్స్ ఇవ్వ బోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. పవన్ కల్యాణ్ ఈ సమ్మర్ క్యాలెండర్‌ను బిజీ షెడ్యూల్‌తో ఉండేలా సెట్ చేసుకున్నాడన్న వార్తను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.
Read Also :
Dasara | ముంబైలో దసరా టీంతో నాని హోలీ వేడుకలు.. ట్రెండింగ్‌లో స్టిల్స్, వీడియో
Rama Banam | గోపీచంద్ రామబాణం నుంచి హైదరాబాదీ భామ ఫస్ట్ లుక్