Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెట్టింట తీవ్ర విమర్శకులు గురవుతున్నాడు. లడ్డూపై నటుడు కార్తీ సంచలన వ్యాఖ్యలు చేయకున్న అతడితో క్షమాపణలు చెప్పించుకున్నాడు అంటూ పవన్‌ను విమర్శిస్తున్నారు నెటిజన్లు. అలాగే ఒకప్పుడు లడ్డూను విమర్శిస్తూ మాట్లాడిన పవన్ ఇప్పుడు లడ్డూ పవిత్రమైనది అంటూ దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలుపుతున్నారు. సనాతన ధర్మం పేరు చెప్పుకుని తిరుమల లడ్డూ విషయంలో ఇంత భక్తి ప్రదర్శిస్తున్న పవన్ కళ్యాణ్ ఒకప్పుడు హిందువులంతా క్రిమినల్స్ అని అనడం, దేవుని దీపంతో తన నాన్న సిగరెట్ కాల్చుకునేవాడని చెప్పడం మార్చిపోయారా అని కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఒకప్పుడు పవన్ లడ్డూపై చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వీడియోగా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ తాను బీజేపీ నాయకులను కలిసినప్పుడు రెండు చెతుల్లో రెండు లడ్డూలను పెట్టారు. ఈ పాచిపోయిన లడ్డూలు ఎవడికి కావాలి అంటూ విమర్శలు చేశాడు. అయితే తాజాగా మాట్లాడుతూ.. లడ్డూ గురించి మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించి మాట్లాడండి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం జోక్‌గా ఉందని. ఒకప్పుడు లడ్డూలపై విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు నటుడు కార్తీ లడ్డూ గురించి మాట్లాడకముందే అతడిని విమర్శించాడు. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
“Don’t Say that Laddu is a sensitive issue, I respect you as an actor…”
– AP Deputy CM #PawanKalyan counter to #PawanKalyan over his comments on #Laddu pic.twitter.com/t8SQsVqXTE
— Ajith Kumar 🐉🪓 (@Ajith_Kumar666) September 24, 2024