OG | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ఒకటి (OG). సాహో ఫేం సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ముంబై, పూణే షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నట్టు అప్డేట్స్ కూడా వచ్చేశాయి. తాజాగా హైదరాబాద్ షెడ్యూల్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. నేడు హైదరాబాద్‌లో ఓజీ మూడో షెడ్యూల్ షురూ అయింది. మరో రెండు రోజుల్లో పవన్ కల్యాణ్ ఈ షెడ్యూల్లో జాయిన్ కానున్నట్టు సమాచారం. ఓజీ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఇప్పటికే ఓజీ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్. రీసెంట్గా మహారాష్ట్రలోని వాయ్ సరస్సు ప్రాంతంలో కీలకమైన ఫైట్ సన్నివేశాల చిత్రీకరణ జరిపింది సుజిత్ టీం. దీనికి సంబధించిన స్టిల్స్ కూడా ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. పవన్ చాలా కాలం తర్వాత ఓజీలో స్టైలిష్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు లొకేషన్ నుంచి బయటకు వచ్చిన స్టిల్స్ ద్వారా తెలిసిపోతుంది.
పవన్ కల్యాణ్ దీంతోపాటు బ్రో చిత్రంలో కూడా నటిస్తుండగా.. ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) షూటింగ్ దశలో ఉండగా.. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. మరోవైపు క్రిష్ డైరెక్ట్ చేస్తున్న హరిహరవీరమల్లులో నటిస్తున్నాడు పవన్ కల్యాణ్.
The third schedule of #OG has kicked off today in Hyderabad, and #PawanKalyan will join the schedule in a few days. 🔥🤗@PawanKalyan #Sujeeth @priyankaamohan @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/x2p7YlYFg8
— BA Raju’s Team (@baraju_SuperHit) June 4, 2023