They Call Him OG | They Call Him OG | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ (They Call Him OG) గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్స్‌ని చిత్రబృందం సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ చిత్రం మొదటిరోజు రూ.154 కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో మొదటిసారి పవన్ కళ్యాణ్ డే1లో రూ.100 కోట్లు కలెక్షన్లు సాధించిన హీరోగా రికార్డులకెక్కాడు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించాడు. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించగా, హీరోయిన్గా ప్రియాంక అరుల్ మోహన్ పవన్ సరసన కథానాయికగా నటించింది. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు.
Idhi Pawan Kalyan Cinema…..#OG Erases History 🔥
Worldwide Day 1 Gross – 154 Cr+ 💥#BoxOfficeDestructorOG #TheyCallHimOG pic.twitter.com/Olf8owSSSZ
— DVV Entertainment (@DVVMovies) September 26, 2025