Pawan Kalyan | ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కనీసం ఏడాదికి అయిన ఒక సినిమా రిలీజ్ చేస్తూ ఉండేవారు. కాని ఆయన రాజకీయాలలోకి వచ్చాక సినిమాల సంఖ్య తగ్గించారు. ఇక ఉపముఖ్యమంత్రి బాధ్యత దక్కించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా లేదా అనే సందేహం కూడా అభిమానులలో కలుగుతుంది. అయితే ఇప్పుడు అభిమానులు అందరు కూడా ఓజీ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. సుజిత్ దర్శకత్వంలో తనకిష్టమైన సబ్జెక్ట్ ఓజీ కాగా, ఈ మూవీ 50 శాతం షూటింగ్ ఎన్నికలకి ముందే పూర్తి చేశారట.
ఇక ఇప్పుడు పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఈ సినిమా కోసం కాల్షీట్స్ కేటాయించడం కష్టం అవుతుంది. హరిహర వీరమల్లు విడుదలైన తర్వాత ఓజీకి కాల్షీట్లు కేటాయించి సెప్టెంబరులో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మే-జూన్ నెలల్లో 25 రోజుల షెడ్యూల్‌తో షూటింగ్‌ని ముగించాలని నిర్మాతలు భావిస్తున్నారట. మరోవైపు ఈ సినిమాని సెప్టెంబర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట.ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రియాంక మోహన్ నాయికగా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మి విలన్. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓజీ సినిమానే పవన్ కల్యాణ్ చివరి సినిమానా లేదంటే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కూడా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
సనాతన ధర్మంపై దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేయాల్సిన బాధ్యతలు పవన్ కళ్యాణ్‌కి ఉండగా, రానున్న రోజులలో ఆయన మరింత బిజీ కానున్నారట. దీంతో పవర్ స్టార్ ను ఇకనుంచి తెరపై చూడటం కష్టమనే అభిప్రాయం వినవస్తోంది. అభిమానులకు మాత్రం ఇది మింగుడు పడని వార్త అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం మార్చిలో విడుదల కావల్సి ఉండగా, అది వాయిదా పడింది. సినిమా బాగా ఆలస్యం అవుతుండటంతో దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకున్నారు. దాంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.