Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘OG’ పై క్రేజు రోజుకూ ఆకాశాన్ని తాకుతోంది. టీజర్, గ్లింప్స్, పోస్టర్లు, పాటలు అంటూ వచ్చిన ప్రతి అప్డేట్కి భారీ రెస్పాన్స్ రావడం చూస్తుంటే, ఈ సినిమా మీద ఉన్న హైప్ ఏ రేంజ్లో ఉందో స్పష్టమవుతోంది. తెలుగులోనే కాకుండా, విదేశాల్లోనూ OG ఫీవర్ జోరుగా నడుస్తోంది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ మెల్బోర్న్ IMAX థియేటర్లో టికెట్లు నిమిషాల్లోనే సేల్ కావడం సినిమాపై భారీ అంచనాలను స్పష్టం చేస్తోంది. డిమాండ్ పెరగడంతో థియేటర్ యాజమాన్యం అదనపు షోలు ప్లాన్ చేస్తోంది. ఓ తెలుగు సినిమా అంత త్వరగా విదేశాల్లో టికెట్లు అమ్ముడవడం చాలా అరుదైన విషయమే.
అమెరికాలో ఇప్పటికే OG అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అక్కడి తెలుగు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో OG ఓ రేంజ్లో వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఇండియాలోనూ OG సినిమాపై మాస్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోకి భారీ రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం మేరకు ట్రైలర్‌ను సెప్టెంబర్ 18 లేదా 20న విడుదల చేయనున్నారు. దర్శకుడు సుజీత్ ప్రస్తుతం ట్రైలర్ కట్ మీద పూర్తి ఫోకస్ పెడుతున్నాడట.
ఈ మూవీని అత్యాధునిక టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందిస్తున్నారు. ట్రైలర్ నుంచి థియేటర్ రిలీజ్ వరకూ ప్రమోషనల్ స్ట్రాటజీ అంతా పక్కా ప్లాన్‌తో చేస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 25, 2025న వరల్డ్‌వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. దసరా సీజన్‌ను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేయడం, సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. మెల్బోర్న్ IMAX లో సోల్డ్ అవుట్ కావడం, అమెరికాలో శరవేగంగా జరుగుతున్న బుకింగ్స్ చూస్తుంటే, ‘OG’ మరోసారి పవన్ కళ్యాణ్ స్టామినాని ప్రూవ్ చేయబోతోందన్న అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియాలో ట్రైలర్ రిలీజ్ తర్వాత బుకింగ్స్ ఫుల్ స్పీడ్‌లో జరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ‘OG’ పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంటూ, ఈ దసరాకి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది.