Vijay sethupathi | తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు విజయ్ సేతుపతి. ఈ స్టార్ యాక్టర్ నటించిన తాజా చిత్రం మహారాజ. జూన్ 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో సందడి చేశాడు మక్కళ్ సెల్వన్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో పవన్ కల్యాణ్ (PawanKalyan) గురించి ఒక్క మాటలో ఏం చెప్తారని ఓ రిపోర్టర్ అడగగా.. (Vijay sethupathi) పవర్‌స్టార్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
పవన్ కల్యాణ్ కష్టపడేతత్వాన్ని నేను చాలా గౌరవిస్తా. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడన్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి. కానీ ఆయన తొడగొట్టినప్పుడు రియల్ లైఫ్‌లో కూడా ఎంత మాసో అర్థమైంది. ఏం జరిగినా స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. ఎవరి కథలోనో ఆయన హీరో కాదు.. ఆయన సొంత కథలో ఆయనే హీరో. మీరు కూడా ఆ మానసిక స్థైర్యం కలిగి ఉండాలి.
పవన్ కల్యాణ్ సార్ గురించి నాకు ఏ విషయం అంతగా తెలియదు. కానీ నా కాంటాక్ట్స్ లిస్టులో ఉన్న కొందరు తెలుగు వాళ్లు వారి స్టేటస్‌లో పవన్ కల్యాణ్ వీడియోలు పెట్టుకున్నారు. వాటిని చూసి ఏం జరిగిందని అడిగాను. వాళ్లు చాలా విషయాలు చెప్పారు. సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్, టీజింగ్ లాంటి విషయాలను ఎవరైతే ఎదుర్కొంటారో.. వారు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారని అర్థం.
ప్రతీ రోజు ఫోన్ మనతోనే ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్లు నా చుట్టూ ఏదో ఒక చెడ్డ విషయం, పుకారు, ట్రోలింగ్ సృష్టిస్తుంటారు. నేను పట్టించుకోకున్నా.. నా చుట్టూ ఉన్న వాళ్లు వాటిని నాకు చూపిస్తూ నిన్ను ఎలా ప్రమోట్ చేస్తున్నారో చూడంటుంటారు. ఆ సమయంలో మీకు మానసిక స్థైర్యం ఉండాలి. ఇలాంటి చాలా విషయాలను ఆయన (పవన్ కల్యాణ్) ఎదుర్కొని.. ఫైనల్‌గా ఆయనేంటో చూపించారని చెప్పుకొచ్చాడు విజయ్ సేతుపతి. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
He is not a hero in somebody’s story, He is the hero in his own story.
– Makkal Selvan #VijaySethupathi about #PawanKalyan Garu.#Maharaja #MaharajaFromJune14 ⚡️ #PSPK #UstaadBhagatsingh #HHVM #HariHaraVeeramallu #OG #TheyCallHimOG pic.twitter.com/IokeWSSQPH— Sai Satish (@PROSaiSatish) June 10, 2024
మహారాజా ట్రైలర్..
మహారాజా ఫస్ట్ లుక్ ..
#MaharajaFirstLook@Dir_nithilan @PassionStudios_ @TheRoute @Sudhans2017 @Jagadishbliss @anuragkashyap72 @Natty_Nataraj @mamtamohan @Abhiramiact @AjaneeshB @Philoedit @DKP_DOP @ActionAnlarasu @ThinkStudiosInd @infinit_maze @jungleeMusicSTH @Donechannel1 #VJS50FirstLook #VJS50… pic.twitter.com/7fF5Y2rDao
— VijaySethupathi (@VijaySethuOffl) September 10, 2023