Hari Hara Veera Mallu | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్ హీరో టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్డేట్ రాక చాలా కాలమే అవుతోంది. ప్రస్తుతం హరిహరవీరమల్లు్పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
పవన్ కల్యాణ్ కెరీర్లోనే తొలిసారి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుందని తాజా వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అంతేకాదు హరిహరవీరమల్లు ఈ ఏడాది చివరికల్లా పూర్తయి.. వచ్చే ఏడాది ఎన్నికల్లోపు విడుదలవుతుందని నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చేశారు. తాజా టాక్ ప్రకారం ఈ మూవీ 2024 వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
అంతేకాదు పవన్ కల్యాణ్ సార్ పొలిటికల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నారని, ఒకసారి ఆయన ఫ్రీ అయితే హరిహరవీరమల్లు క్లైమాక్స్ పూర్తి చేస్తామని పవన్ కల్యాణ్ వ్యక్తిగత కుంగ్ ఫూ ట్రైనర్ హర్ష్ వర్మ (Harsh Verma) ఓ చిట్‌చాట్ సెషన్లో చెప్పాడు. ఈ సినిమాకు పవన్ కల్యాణ్ తనను రెఫర్ చేయడం వల్ల ఇందులో నటించానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి హరిహరవీరమల్లు సినిమా సంగతేంటి అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులను అదిరిపోయే న్యూస్ ఖుషీ చేస్తోంది.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. క్రిష్ టీం ఇప్పటికే రిలీజ్ చేసిన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. హరిహరవీరమల్లు అండ్ టీంపై వచ్చే హై ఆక్టేన్ యాక్షన్ సీన్లను ఇప్పటికే రామోజీఫిలింసిటీలో చిత్రీకరించారని తెలిసిందే.
హర్ష్ వర్మ ఏమన్నాడంటే..?
‘ @PawanKalyan sir is busy with his political party called JanaSena, which is big down south 👌#HariHaraVeeraMallu climax has to be shoot once he is free: @verma_h
PK recommend him and now he will act in HHVM 😍 pic.twitter.com/vBCMm6Yq2Q
— ★彡 𝙽𝚊𝚟𝚎𝚎𝚗 𝙹𝚂𝙿 🦅彡★ (@_jspnaveen) September 10, 2023
Actress @AgerwalNidhhi about #PawanKalyan and @HHVMFilm 🔥#HariHaraVeeraMallu @PawanKalyanpic.twitter.com/wNDJ3H6ZeZ
— PawanKalyan FC™ (@Legend_PSPK) September 6, 2023
#HariHaraVeeraMallu will release in Two Parts 🔥🔥🔥🔥
Great news for #TeamHHVM 😎 pic.twitter.com/xg92chmLl1
— SHIVAJI SENANI (@ShivajiSurada) September 13, 2023
#HariHaraVeeraMallu to be completed by this year end and we are planning to Release it before Elections- AM Rathnam💥
pic.twitter.com/8s8VuqoP76— Rusthum (@RusthumlHere) September 4, 2023