Hari Hara Veera Mallu | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హరిహరవీరమల్లు పార్ట్-1 జులై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో క్రేజీ అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
సినిమాలో హరిహరవీరమల్లు పాత్ర సనాతన ధర్మాన్ని కాపాడే లార్డ్ విష్ణు, లార్డ్ శివను ప్రతిబింబించేలా ఉండబోతుందంటూ ఇండస్ట్రీ సర్కిల్లో ఇప్పటికే ఆసక్తికర వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో క్రేజీ న్యూస్ సినీ, రాజకీయ వర్గాల్లో సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పాత్రకు లెజెండరీ యాక్టర్స్ కమ్ పొలిటీషియన్స్ ఎన్టీఆర్, ఎంజీఆర్‌లను స్పూర్తిగా తీసుకున్నాడట డైరెక్టర్ జ్యోతికృష్ణ.
ఈ విషయమై జ్యోతికృష్ణ ఓ చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాలు చేశారు. నిజాయితీగా మెసేజ్ ఓరియెంటెడ్ థీమ్స్‌తో కూడిన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఈ విషయాలను స్ఫూర్తిగా తీసుకోవడం ‘మాట వినాలి’ పాట రూపకల్పనకు ప్రేరణగా నిలిచింది. పవన్ భావజాలం, ఇంప్రెషన్‌ను ప్రతిబింబిస్తూ జీవితంలో సానుకూలత, ధర్మాన్ని స్వీకరించాలనే సారాంశాన్ని ఈ పాట తెలియజేస్తుంది. మాట వినాలి ప్రేక్షకులను చాలా ప్రభావితం చేయడంతోపాటు వారికి బాగా కనెక్ట్ అయిందన్నాడు.
ఎన్టీఆర్ ప్రఖ్యాతి గాంచిన నటనల్లో కొన్ని పౌరాణిక, జానపద చిత్రాల నుండి వచ్చాయని తెలిసిందే. రాముడు, కృష్ణుడిలాంటి ఐకానిక్ పాత్రల్లో ఆయన లీనమైన తీరుకు ఖచ్చితమైన ప్రాధాన్యం ఉండేది. ఎన్టీఆర్ ధర్మాన్ని నిలబెట్టే శక్తి, సామర్థ్యాన్ని సూచించే విల్లు, బాణంతో శ్రీరాముడిగా పౌరాణికాల్లో అద్భుతంగా చిత్రీకరించబడ్డారు. ఈ విషయాలను ప్రేరణగా తీసుకుని హరి హర వీర మల్లు (ఇది కూడా పీరియాడికల్ సినిమా కావడం)లో పవన్ కోసం విల్లు, బాణాన్ని రూపొందించాను. ఈ ఆయుధాలు పవన్ శక్తి, న్యాయం కోసం పోరాడటానికి, ధర్మాన్ని నిలబెట్టేందుకు కావాల్సిన సంసిద్ధతను సూచిస్తాయని చెప్పుకొచ్చాడు జ్యోతికృష్ణ.
ప్రజలు పవన్ కళ్యాణ్‌ను హీరోగా కాకుండా నాయకుడిగా చూస్తున్నారని తాను స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు గ్రహించానని.. అందుకే సినిమా కథనాన్ని ఎలివేట్ చేసేలా ప్రతీ సన్నివేశాన్ని ప్రత్యేకంగా సృష్టించాలనుకున్నానంటూ చెప్పాడు. మొత్తానికి ఈ కామెంట్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Am Ratnam | హరిహర వీరమల్లు నుండి క్రిష్ వెళ్లిపోవడానికి గల కారణం ఇదే.. ఏఎం రత్నం క్లారిటీ