పవన్‌కల్యాణ్ ‘హరిహర వీరమల్లు – పార్ట్ 1’ సినిమా ఈ నెల 12 నుంచి థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కొంత భాగం పూర్తయిన ఈ సినిమాను, జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ఇదిలావుంటే.. ఇదే వీరమల్లు కథ అంటూ సోషల్ మీడియాలో ఓ లైన్ హల్చల్ చేస్తున్నది. ఇందులో హరిహర వీరమల్లు అనే దొంగగా పవన్‌కల్యాణ్ కనిపిస్తారట. ఉన్నోడ్ని కొట్టి లేనోడికి పెట్టే రాబిన్హడ్ తరహా పాత్ర అన్నమాట. 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్య కాలంలో ఈ కథ నడుస్తుందట.
గోల్కొండ తానీషా నుంచి మొదలైన కథ, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దగ్గర ముగుస్తుందట. కోహినూర్ వజ్రం ఈ కథకు కీలకమని సమాచారం. మొఘల్ రాజు ఆస్థానంలో ఉన్న ఆ వజ్రాన్ని దొంగిలించేందుకు హీరో చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ అట. పవన్‌కల్యాణ్ నటిస్తున్న ఈ తొలి జానపద చిత్రంలో పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్ నటిస్తుండగా, ఔరంగజేబుగా బాబీడియోల్ కనిపిస్తారట. ఇక ఏయే పాత్రలు ఎవరు పోషిస్తారనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.