పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘హరిహరవీరమల్లు’ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మించారు. మొఘల్ కాలం నాటి ఈ కథలో చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో కనిపించనున్నారు పవన్‌కల్యాణ్.
అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను జూలై 3న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్‌ఖేర్, సత్యరాజ్, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వీఎస్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాణ సంస్థ: మెగా సూర్య ప్రొడక్షన్స్, దర్శకత్వం: జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి.