Pawan Kalyan | పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత హరిహర వీరమల్లు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మిక్సడ్ టాక్ సంపాదించుకోగా, అభిమానులకి బాగా నచ్చేసింది. ఇక తాము సినిమా ద్వారా తాము అనుకున్నది చెప్పామని, మంచి విజయం సాధించినట్టు మేము భావిస్తున్నాము అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండని పవన్ కళ్యాణ్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింంది. పవన్ కళ్యాణ్ తన చిన్ననాటి కరాటే గురువు షిహాన్ హుస్సైని శిష్యుడిగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన విషయం తెలిసిందే. చెన్నైలోని షిహాన్ హుస్సైని ఆధ్వర్యంలోని కరాటే స్కూల్లో పవన్ శిక్షణ పొందారు. ఇటీవల ఈ ప్రముఖ గురువు కన్నుమూశారు.
ప్రస్తుతం ఆ స్కూల్‌ను పవన్‌కు సీనియర్ అయిన రెన్షి రాజా అవర్ నడుపుతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ఆయనను తిరిగి కలవడం సంతోషంగా మారింది. ఈ సందర్భంగా పవన్ తన పాత గురువు, స్నేహితుడు అయిన రెన్షి రాజాతో కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. 35 ఏళ్ల తర్వాత తిరు రెన్షి రాజా అవర్ని తిరిగి కలవడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉంది. ఆయన 1990లో నాకు సీనియర్. అప్పట్లో ఆయన బ్లాక్ బెల్ట్ సాధించారు, నేను గ్రీన్ బెల్ట్‌లో ఉన్నాను.
ఇప్పుడు మా కరాటే స్కూల్‌కు ఆయన నాయకత్వం వహిస్తున్నారని తెలిసి గర్వంగా ఉంది. షిహాన్ హుస్సైని గారి దార్శనికతను ఆయన అంకితభావంతో ముందుకు తీసుకెళ్తున్నారు. షిహాన్ హుస్సేనితో మా దీర్ఘకాల అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం, మార్షల్ ఆర్ట్స్ పట్ల మాకున్న ఉమ్మడి అభిరుచిని చర్చించడం వల్ల అనేక పాత జ్ఞాపకాలను తిరిగి పొందడం చాలా సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన సీనియర్ రెన్షి రాజాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కరాటే డ్రెస్‌లో పవన్ మరింత ఆకట్టుకుంటున్నారు. కాగా, పవన్ హరిహర వీరమల్లు సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ మళ్లీ ప్రారంభించారు. ఇందుకోసం రెన్షి రాజా సాయాన్ని తీసుకున్నట్టు సమాచారం. అలాగే “ఓజీ” అనే చిత్రంలో కూడా పవన్ తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తోంది.