Pawan Kalyan | ఓ వైపు అభిమానుల కోసం సినిమాలు చేస్తూ.. మరోవైపు జనాల కోసం రాజకీయాల్లో కొనసాగుతూ తీరిక లేకుండా ఉన్నారు నటుడు, జనసేన అధినేత పనవ్ కల్యాణ్ (Pawan Kalyan). ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీ షెడ్యూల్స్‌తో ఉన్నప్పటికీ ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో (AP Politics) అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్లేలా ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు. మరోవైపు ఇప్పటికే లైన్లో పెట్టిన భారీ సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు.
జనసేన కార్యకలాపాలు ప్రధానంగా మంగళగిరి కేంద్రంగా కొనసాగిస్తున్నారని తెలిసిందే. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఖాతాలో హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu), సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ (OG), హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాలున్నాయి. ఇవన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే పొలిటికల్ ప్లాన్‌లో భాగంగా పవన్ కల్యాణ్ ఈ నెల చివరి వరకు మంగళగిరిలో ఉండాలనుకున్నారట. అయితే ఎవరూ ఊహించని విధంగా రాజకీయ కార్యకలాపాలు, ప్రెస్మీట్స్ను రద్దు చేసి సెప్టెంబర్ 12న మంగళగిరి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్.
సినిమా షూటింగ్స్ మీద ఫోకస్..
తాజా అప్డేట్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో జాయిన్ అయ్యారు పవన్ కల్యాణ్. అయితే ఇలా హఠాత్తుగా షూటింగ్ మూడ్‌లోకి వెళ్లిపోవడంపై కారణముందని ఓ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో జైలుకెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వెంటనే బెయిల్ వచ్చే అవకాశాలు లేవని సమాచారం అందడంతో ఇలా నిర్ణయం తీసుకున్నారని టాక్. చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే దాకా నందమూరి బాలకృష్ణ టీడీపీ నాయకత్వ బాధ్యత తీసుకోవాలని ఫిక్స్ అయ్యారని తెలియడంతో.. బాలకృష్ణతో కలిసి మీడియా అటెన్షన్‌ను షేర్ చేసుకోవడం కంటే సినిమా షూటింగ్స్ మీద దృష్టి పెడితే బాగుంటుందని పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌కు వచ్చేశాడట.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న హరిహరవీరమల్లు రెండు పార్టులుగా రాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే రిలీజైన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ వీడియో నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఓజీ టీజర్ పవన్ కల్యాణ్‌ను నయా స్టైలిష్ అవతార్‌లో చూపించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ సుజిత్.