Deputy CM Pawan Kalyan | ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవలే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారని తెలిసిందే. పొలిటికల్ కెరీర్లో అరుదైన మైల్‌స్టోన్‌ను చేరుకున్న సందర్భాన్ని ఇప్పటికే అభిమానులు, ఫాలోవర్లు, కార్యకర్తలు వేడుకగా చేసుకుంటున్నారు. కాగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా పవన్‌కల్యాణ్ కుటుంబంతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో దిగిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైట్ అండ్ వైట్ కుర్తా, ప్యాంట్లో పవన్ కల్యాణ్.. చీరకట్టులో అన్నాలెజినోవా, ధోతి, షర్ట్ కాంబోలో అకీరా నందన్, పంజాబీ డ్రెస్‌లో ఆద్య.. ఇలా అందరూ ట్రెడిషనల్ వేర్లో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పుడీ ఫొటోను అభిమానులు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో తెగ వైరల్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టారని తెలిసిందే.
హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్లో ఓజీ చేస్తుండగా.. మరోవైపు హరిహరవీరమల్లులో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ గ్లింప్స్ వీడియోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. మరోవైపు హరిహరవీరమల్లు రషెస్ కూడా సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. మళ్లీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తాయనేది చూడాలి.
Pic of the day #PawanKalyan Garu’s Family ❤️❤️ pic.twitter.com/seUuqBwyJQ
— Deputy CM PK (@DeputyCMPK) June 23, 2024