Pawan Kalyan Entry in OG | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ ‘ఓజీ’ (OG) చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా నుంచి నెట్‌ఫ్లిక్స్ తాజాగా పవన్ ఎంట్రీ సీన్‌ను యూట్యూబ్ వేదికగా పంచుకుంది. సత్యదాదా(ప్రకాశ్‌రాజ్)ని చంపుదామని విలన్ గ్యాంగ్ అతడిని బంధించి ఉంచగా.. దాదాని కాపాడటానికి ఓజాస్ గంభీరా వచ్చే క్రమంలో ఈ సన్నివేశం వస్తుంది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ సీన్‌ను మీరు కూడా చూసేయండి.