పవర్ స్టార్ పనవ్ కళ్యాణ్ మూడేళ్ల పాటు రాజకీయాలు చేయకపోయే సరికి పరిశ్రమ వెలవెలబోయినట్టు కనిపించింది. సినిమాల్లోకి పవన్ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, ఎట్టకేలకు వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చేస్తున్నాడు.
భీమ్లా నాయక్ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడాకనిపించబోతున్నాడు. రానా మరియు పవన్ ల మద్య ఉండే సన్నివేశాలు చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిత్యా మీనన్, రానాకి జోడీగా ఐశ్వర్యరాజేష్ నటిస్తుంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ మరియు టైటిల్ సాంగ్ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. ఫస్ట్ గ్లింప్స్ లో పవన్ లుంగీ ఎగ్గట్టి వస్తూ సీరియస్ గా డైలాగ్ చెప్పడం అభిమానులకు పిచ్చెక్కించింది. తక్కువ సమయంలోనే మిలియన్ లైక్స్ ను దక్కించుకున్న పాట రెండున్నర కోట్లకు పైగా వ్యూస్ ను దక్కించుకుని ఇంకా కూడా యూట్యూబ్ టాప్ ట్రెండ్స్ లో కొనసాగుతుంది.
భీమ్లానాయక్ ఫస్ట్ గ్లింప్స్ కు అరుదైన రికార్డ్ దక్కింది. కేవలం 50 సెకన్ల వీడియో అయిన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ కు రెండు కోట్ల వ్యూస్ రావడంతో పాటు ఏకంగా మిలియన్ లైక్స్ దక్కాయి. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ మరియు ఫస్ట్ గ్లింప్స్ కు మిలియన్ మరియు మిలియన్ చొప్పున రెండు మిలియన్ ల లైక్స్ దక్కాయి. ఇది అరుదైన రికార్డ్. ఒక సినిమా ఫస్ట్ గ్లింప్స్ కు ఇంత భారీగా లైక్స్ రావడం అనేది కేవలం పవన్ కళ్యాణ్ సినిమా కే చెందింది అంటున్నారు.