BRO The Avatar | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి బ్రో (Bro The Avatar). ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మరో లీడ్ రోల్లో నటిస్తుండగా.. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్సలో నటిస్తున్నారు. బ్రో జులై 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది.
హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి Pre Release Eventకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో రెండు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్ మూవీ లవర్స్ ను ఖుషీ చేస్తోంది. తాజాగా మేకర్స్ బ్రో బీటీఎస్ ఫొటోలను షేర్ చేశారు. పవన్ కల్యాణ్ డిఫరెంట్ గెటప్స్‌లో నిర్మాత వివేక్ కూచిబొట్లతో చిట్ చాట్ చేస్తున్న స్టిల్‌తోపాటు త్రివిక్రమ్‌తో మాట్లాడుతున్న ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇప్పటికే విడుదల చేసిన బ్రో టీజర్, ట్రైలర్ నెట్టింట మంచి వ్యూస్ రాబడుతున్నాయి. బ్రో నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. బ్రో నుంచి సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ కాంబోలో వచ్చే మై డియర్ మార్కండేయ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. మరోవైపు సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ మధ్య వచ్చే రొమాంటిక్ మెలోడి జానవులే లిరికల్ వీడియో సాంగ్ ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది.
సాయి ధరమ్ తేజ్, టైమ్ లైన్, పవన్ కల్యాణ్ మధ్య సాగే ఘటనల నేపథ్యంలో బ్రో ఉండబోతున్నట్టు టీజర్‌తో చెప్పేశాడు సముద్రఖని. ఈ చిత్రంలో. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నారు.
బ్రో వర్కింగ్ స్టిల్స్..
Bro The Avatar1
My Time with #BRO
Infinite Interactions …@PawanKalyan garu@peoplemediafcy @vishwaprasadtg garu@thondankani garu pic.twitter.com/V3dIF6jyWh— Vivek Kuchibhotla (@vivekkuchibotla) July 25, 2023
బ్రో ట్రైలర్..
బ్రో టీజర్..
జానవులే లిరికల్ వీడియో సాంగ్..
మై డియర్ మార్కండేయ సాంగ్..