Bro movie update | కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం బ్రో!
పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం టీజర్‌ను విడుదల చేశారు. చీకటిలో చిక్కుకుపోయిన సాయిధరమ్‌తేజ్ తనను రక్షించేవారి కోసం ఎదురుచూడటం, చివరకు ‘బ్రో’ అనే పిలుపుతో పవన్‌కల్యాణ్ ప్రత్యక్షం అయ్యే సన్నివేశాలతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
‘కాలం మీకు అంతుపట్టని ఇంద్రజాలం’ ‘సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా నువ్వు’ అంటూ పవన్‌కల్యాణ్ చెప్పిన సంభాషణలు మెప్పించాయి. వినోదాత్మక అంశాలతో టీజర్‌ను తీర్చిదిద్దారు. ‘ఫాంటసీ, ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఫ్యామిలీ డ్రామా ఇది. అభిమానులకు పండగలా ఉంటుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజీత్ వాసుదేవ్, సంగీతం: తమన్, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: త్రివిక్రమ్, రచన, దర్శకత్వం: సముద్రఖని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

