Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఓజీ చిత్రం ద్వారా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2025లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా లేదా అనే సందేహం అందరిలో ఉంది. ఇదే సమయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ సంస్థలో ఆయన ఒక చిత్రంలో నటించేందుకు ఒప్పందం పూర్తి అయ్యింది.
ఇప్పటికే నిర్మాత ఎన్ కె లోహిత్ పవన్ కల్యాణ్‌ను పలుమార్లు కలిశారు. ఇప్పటివరకు సినిమా దర్శకుడు, కథ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. కేవిఎన్ ప్రొడక్షన్స్ ఇద్దరు ప్రముఖ తమిళ దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు లోకేష్ కనకరాజ్, మరొకరు హెచ్ వినోద్. లోకేష్ కనకరాజ్ పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. ఖైదీ, విక్రమ్, కూలీ వంటి హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హెచ్ వినోద్ ప్రతిభావంతుడు, థ్రిల్లర్, స్టైలిష్ యాక్షన్ చిత్రాల్లో ప్రత్యేకత సంపాదించుకున్నాడు. ఇప్పటికే అజిత్‌తో వలిమై, తెగింపు, మరియు విజయ్‌తో జన నాయకన్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
కేవిఎన్ సంస్థ .. ఈ ఇద్దరి దర్శకులలో ఒకరితో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సెట్ కావాలని ప్రయత్నిస్తోంది. అభిమానులు లోకేష్ కనకరాజ్ తో పవన్ కలయిక సెట్ కావాలని కోరుతున్నారు. ఈ కలయిక ఓజీ హిట్‌కు 100 రెట్లు ఇంపాక్ట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. కేవిఎన్ ప్రొడక్షన్స్ ఇతర ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. యష్ ‘టాక్సిక్, మెగాస్టార్ చిరంజీవి & డైరెక్టర్ బాబీ కలయికలో మెగా 158 చిత్రాలు రూపొందనున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ కొత్త ప్రాజెక్ట్ కోసంఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. మరి పవన్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే దానిపై త్వరలోనే అధికారికంగా క్లారిటీ రానుంది.