Kaikala Satyanarayana | కైకాల సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించిన చిరంజీవి, పవన్ కళ్యాణ్..!
టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటబడుతున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ కృష్ణ మరణ వార్తల నుండి ఇంకా తేరుకోకముందో కైకాల సత్యనారాయణ వంటి మరో గొప్ప నటుడిని టాలీవుడ్ ఇండస్ట్రీ కోల్పోయింది. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న కైకాల.. శుక్రవారం తెల్లవారుజామున ఫిలిం నగర్లో
Kaikala Satyanarayana | టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటబడుతున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ కృష్ణ మరణ వార్తల నుండి ఇంకా తేరుకోకముందో కైకాల సత్యనారాయణ వంటి మరో గొప్ప నటుడిని టాలీవుడ్ ఇండస్ట్రీ కోల్పోయింది. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న కైకాల.. శుక్రవారం తెల్లవారుజామున ఫిలిం నగర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచాడు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్లో విషాద చాయలు అలుముకున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు కైకాల మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు.
కైకాల సత్యనారాయణ భౌతిక కాయానికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. అనంతరం కైకాల కుటుంబ సభ్యులను పరామర్శించాడు. ఈ సందర్భంగా అతనితో అనేక చిత్రాల్లో నటించానని చిరంజీవి తెలిపారు. తనను తమ్ముడూ అని ప్రేమగా పిలిచేవారని పేర్కొన్నారు. కైకాల అజాత శత్రువని, అతనిది స్వచ్ఛమైన మనసు అని చెప్పుకొచ్చారు. ఆయనతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక పసిపిల్లాడితో చేస్తున్నట్లు అనిపిస్తుందని వెల్లడించాడు.
పవన్ మాట్లాడుతూ..కైకాల సత్యనారాయణ గారి మృతి చాలా భాదకరమని తెలిపాడు. షూటింగ్ సమయంలో కలిసినా, పక్క సెట్లో ఉన్నా చాలా అప్యాయంగా పలకరిస్తాడు. జూనియర్స్ ఆయనను ఏకవచనంతో పిలిచిన ఏ మాత్రం నొచ్చుకోని నిగర్భి. ఆయన మృతి ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమకు లోటు. అలాగే వారి కుటుంబ సభ్యులకు, వారి సతిమణికి జనసేన తరుపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని పేర్కొన్నాడు. వీళ్ళతో పాటు వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు కైకాల భౌతిక కాయానికి నివాళులర్పించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

