టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ చేస్తున్న ప్రాజెక్టు హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). క్రిష్ (Krish) డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి వీఎస్ జ్ఞానశేఖర్ (VS Gnanashekar) సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సీనియర్ సినిమాటోగ్రాఫర్ హోం బ్యానర్ కాళి ప్రొడక్షన్స్ లో రెండో చిత్రాన్ని ప్రకటించారు.
గమనం సినిమాతో డైరెక్టర్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుజనా రావ్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. గమనం చిత్రానికి వీఎస్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడమే కాకుండా..వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడించనున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
ప్రస్తుతం పవన్‌తో హరిహరవీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నారు జ్ఞానశేఖర్. షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. హరిహర వీరమల్లు ప్రాజెక్టులో బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీ రోల్స్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది.