Pawan- Balayya | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి నటసింహం బాలయ్య.. ఇద్దరు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులే. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో యాక్టివ్‌గా ఉన్నారు. అయితే వీరి సినిమాలపై అభిమానులలో ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ అఖండకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న అఖండ 2 విడుదలపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.ఇంతకముందు ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయాలనుకోగా, ఇప్పుడు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట బాలయ్య.
అందుకు కారణం అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఇద్దరు మాస్ హీరోల సినిమాల మధ్య బాక్సాఫీస్ క్లాష్ రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ సినిమాపై ఉన్న హైప్, ఫ్యాన్స్‌లో నెలకొన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని బాలయ్య తన అఖండ 2 రిలీజ్‌ను అక్టోబర్ 2 (దసరా సెలవులు)కి వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ ఇద్దరూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నేతలు, హీరోలు. వారి సినిమాల కోసం ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు.
అయితే పవన్ కళ్యాణ్ సినిమా కోసం బాలయ్య చేసిన త్యాగం పట్ల కొందరు నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అఖండ 2 రిలీజ్ డేట్ వాయిదాపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అయితే ఇటీవల పరిస్థితులని బట్టి చూస్తే ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదనే అభిప్రాయం కలుగుతుంది. డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమా టీజర్, పోస్టర్లు భారీ బజ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో పవన్ లుక్, యాక్షన్ ఎలిమెంట్స్‌పై ఫ్యాన్స్‌లో మంచి ఎగ్జైట్మెంట్ ఉంది. బాలయ్య ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పూర్తి స్పేస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వెనక్కి తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది.