OG Pre Release Event : టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pavan Kalyan) కొత్త చిత్రం ‘ఓజీ’ ప్రీ – రిలీజ్ వేడుక ఎల్బీ నగర్లో సందడిగా జరిగింది. వర్షం పడుతున్నా సరే తమ అభిమాన స్టార్‌ను చూసేందకు ఫ్యాన్స్ పోటెత్తారు. పవన్ సైతం వానలోనే తనదైన స్టయిల్లో మాట్లాడుతూ జోష్ నింపారు. తాను డిప్యూటీ సీఎం హోదాలో కాకుండా మీ హీరోగా వచ్చానంటూ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు పవన్.
‘ఓజీ కన్సార్ట్’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకస్టేజిమీదకు కత్తి పట్టుకొని వచ్చిన పవన్ ఈ సినిమాకు హీరో నేను కాదు సుజీత్ అని దర్శకుడిని ఆకాశానికెత్తేశారు పవర్ స్టార్. డ్రమ్స్ శివమణి మ్యూజిక్ వాయిస్తుంటే మైక్‌తో అందరికీ వినిపించారు పవన్. ఈ కార్యక్రమంలో హీరోయిన ప్రియాంక మోహనన్, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మిలు పాల్గొన్నారు. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే టికెట్ ధరల పెంపునకు.. ప్రత్యే ప్రీమియం షోకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
What I have been waiting from past 15 yearsssss😭😭😭😭
THIS IS MY PAVAN KALYAN 🥵#OGConcert #TheyCallHimOG
— 🐆 (@Shaashaaaank) September 21, 2025
సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు ఓజీ ప్రత్యేక ప్రీమియర్ షో వేయనున్నారు. ఈ షో టికెట్ ధర రూ. 800. సింగిల్ స్క్రీన్‌లో రూ.277, మల్టీఫ్లెక్స్‌లో రూ.445 వరకూ ఉండనుంది. సిసినిమా విడుదలైన పది రోజుల పాటు పెంచిన టికెట్ ధరలు వర్తించనున్నాయి. పదకొండో రోజు నుంచి సింగిల్ స్క్రీన్లలో రూ.177, మల్టీ ఫ్లెక్స్‌లో రూ.295 నుంచి టికెట్లు లభిస్తాయి.