షారుఖ్‌ఖాన్ తన కొత్త సినిమా ‘పఠాన్’తో బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్నారు. ఓవర్సీస్లో 13 మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరచగా..ఇప్పుడు దేశీయంగా అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా 400 కోట్ల రూపాయల క్లబ్‌కు చేరువైంది. ఇప్పటిదాకా ఈ రికార్డ్ 373 కోట్ల రూపాయల వసూళ్లతో ఆమిర్ ఖాన్ ‘దంగల్’ చిత్ర పేరిట ఉండగా..పఠాన్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. 511 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన ‘బాహుబలి 2’ ప్రస్తుతం ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా ఉంది. షారుఖ్ సినిమా జోరు ఇలాగే కొనసాగితే తదుపరి లక్ష్యం ‘బాహుబలి 2’నే అనుకోవచ్చు. 2013లో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో ఇలాంటి సూపర్ హిట్ అందుకున్న షారుఖ్…పదేండ్ల తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని దక్కించుకున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పడుకోన్ నాయికగా నటించగా…జాన్ అబ్రహాం ప్రతినాయకుడిగా మెప్పించారు. ‘పఠాన్’ బ్లాక్ బస్టర్ అవడం వరుస ఫ్లాప్‌లతో నష్టాల పాలైన నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్‌కు ఊపిరినిచ్చినట్లయింది.