Pathan Movie Row | బాలీవుడ్ బాద్షా కమ్‌బ్యాక్ చిత్రం పఠాన్. ఈ చిత్రంలో షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొణే నటిస్తున్నది. ఇటీవల సినిమాకు సంబంధించి ‘భేషరమ్ రంగ్’ పాట విడుదలవగా.. వివాదం రాజుకున్నది. రోజులు గడుస్తున్న కొద్దీ వివాదం పెరుగుతున్నది. అయితే, భేషరమ్ రంగ్ పాటలో దీపికా కాషాయరంగు బికినీ ధరించి షారూఖ్‌తో రొమాన్స్ చేసింది. దీనిపై హిందూ సంఘాలతో పాటు ముస్లిం సంస్థలు మండిపడ్డాయి.
పాటను సినిమా నుంచి తొలగించాలని కొందరు, సినిమానే బ్యాక్ చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల సినిమా విడుదల చేయొద్దంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ వివాదం లోక్‌సభను చేరింది. సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారని బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీ విమర్శించారు. అధికారంలో ఉన్న వారే సినిమాను బ్యాన్ చేయాలంటే సెన్సార్ బోర్డు పని ఏమిటని ఆయన ప్రశ్నించారు.