Pathaan Movie | షారుఖ్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు అయింది. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. మధ్యలో రెండు, మూడు సినిమాల్లో మెరిసినా అవి ఫ్యాన్స్‌కు సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఇక షారుఖ్‌ను ఫుల్ లెంగ్త్ రోల్లో చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా షారుఖ్ కూడా ఈ నాలుగేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘పఠాన్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా ఇండియాలో పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. హిందీ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇండియాలో దాదాపు 5000లకు పైగా స్క్రీన్లలో రిలీజ్ కాబోతుందట. షారుఖ్ సినిమా ఇంత పెద్ద మొత్తంలో రిలీజవడం ఇదే మొదటి సారి. అంతేకాకుండా ఈ సినిమాకు ఏమాత్రం పాజిటీవ్ టాక్ వచ్చిన మొదటి రోజే 40కోట్ల నెట్ కలెక్షన్లు రాబడుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే గనుక జరిగితే షారుఖ్ కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా మిగిలిపోతుంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా యష్‌రాజ్ ఫిలింస్‌లో బ్యానర్లో 50వ చిత్రం కావడం విశేషం. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.