Pathaan Movie Second Single | బాలీవుడ్ కింగ్ కాంగ్ షారుఖ్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళయింది. మధ్యలో రెండు, మూడు సినిమాల్లో గెస్ట్ రోల్స్ పోషించిన అభిమానులకు అవి ఫుల్ మీల్స్ పెట్టలేకపోయాయి. ఆయనను వెండితెరపై మళ్ళీ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. సంజు తర్వాత షారుఖ్ నాలుగేళ్ళు గ్యాప్ తీసుకుని పఠాన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈసినిమాలోని సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ తెలుగు వెర్షన్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ‘కుమ్మేసే’ అంటూ సాగే ఈ పాట శ్రోతలను తెగ ఆట్టుకుంటుంది. దీపికా మరోసారి తన హాట్ అందాలతో యూత్‌లో హాట్ పుట్టిస్తుంది. షారుఖ్ సిగ్నేచర్ మూమెంట్స్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. విశాల్ శేఖర్ స్వర పరిచిన ఈ పాటను హరీచరణ్, సునిత ఆలపించారు. ఇక ఇప్పటికే రిలీజైన ‘బేషరమ్ రంగ్’ పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీపిక బికినీ షో ఇండియాను ఊపేసింది. ఈ పాటలోని అసభ్యకర సన్నివేశాలు తొలగించకుంటే సినిమానే బ్యాన్ చేయాల్సి ఉంటుందని పలువురు రాజకీయన నాయకులు హెచ్చరించాడు. అంతలా ఈ పాట దుమారం రేపింది. మరీ ఇప్పుడు రిలీజైన సెకండ్ సింగిల్‌పై ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా యష్‌రాజ్ ఫిలింస్‌లో బ్యానర్లో 50వ చిత్రం కావడం విశేషం. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.