Pathaan Movie enters 500 crore club | సినిమా చేసి నాలుగేళ్లయింది. హిట్టు చూసి పదేళ్లయింది. అయినా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’పై ఎక్కడ లేని క్రేజ్. గత రెండు మూడేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్‌కు సరైన హిట్టు లేక తేలిపోయింది. మధ్యలో ‘భూల్ భూలయా-2’, ‘దృష్యం-3’ వంటి సినిమాలు బాలీవుడ్‌ను ఆదుకున్నా ఎక్కడో సౌత్ సినిమాల డామినేషన్ కనిపించింది. సౌత్ సినిమాల కలెక్షన్లు ముందు అవి నథింగ్లా అనిపించాయి. పైగా ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో బైకాట్ అంశం ఎక్కువైపోయింది. దాంతో సినిమాలు రిలీజ్ చేయాలంటేనే దర్శక, నిర్మాతల్లో ఎక్కడ లేని గుబులు. ఈ క్రమంలో అన్ని వివాదాలను ఎదుర్కొంటూ పఠాన్ జనవరి 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
ముందు నుండి ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఉంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే దాదాపు రూ.20 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. దాంతో ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. వాళ్లనుకున్నదే నిజమైంది. తొలిరోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి కంబ్యాక్ అంటే ఇది అంటూ షారుఖ్ నిరూపించాడు. తొలిరోజే అనుకుంటే రెండవ రోజు అంతకు మించి కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. అది కూడా డివైడ్ టాక్‌తో. ఇక మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. షారుఖ్‌ఖాన్ యాక్షన్, దీపికా అందాలు, జాన్ అబ్రహం విలనిజం ప్రేక్షకులను థియేటర్లకు రిపీటెడ్‌గా వచ్చేలా చేశాయి. తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డు క్రియేట్ చేసింది.
తాజాగా మూవీ రూ.500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. అది కూడా ఐదు రోజుల్లోనే. ఇంత త్వరగా ఆ ఫీట్‌ను అందుకున్న తొలి బాలీవుడ్ మూవీగా సరికొత్త రికార్డు సృష్టించింది. పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాలు ఫుల్ రన్లో వంద కోట్లు వసూలు చేయడం గగనం అయిన పరిస్థితుల్లో దశాబ్దానికి పైగా హిట్టులేని షారుఖ్ ఇలాంటి ఘనతను సాధించాడంటే ఆయన క్రేజ్ ఏలాంటిదో తెలుస్తుంది. కేవలం బాలీవుడ్లోనే కాదు తెలుగులోనూ ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తుంది. రిలీజైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఇప్పటికే రెండు కోట్ల లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు తెచ్చిపెట్టింది.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. జాన్ అబ్రహం కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఇదే జోరు కొనసాగితే పఠాన్ మూవీ ఫుల్ రన్లో రూ.1000 కోట్లు సాధించడం పెద్ద కష్టమేమి కాదు.
‘PATHAAN’ CROSSES ₹ 500 CR MARK: ₹ 542 CR WORLDWIDE *GROSS* IN 5 DAYS… #Pathaan WORLDWIDE [#India + #Overseas] *Gross* BOC… *5 days*…
⭐️ #India: ₹ 335 cr
⭐️ #Overseas: ₹ 207 cr
⭐️ Worldwide Total *GROSS*: ₹ 542 cr
🔥🔥🔥 pic.twitter.com/UZvYoipsx0— taran adarsh (@taran_adarsh) January 30, 2023