మూవీ లవర్స్‌తోపాటు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూసిన పఠాన్ (Pathaan) థియేటర్లలో సందడి చేస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న సినిమా కావడం, అది కూడా స్టార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో నటిస్తుండటంతో మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే పఠాన్ ఓటీటీ పార్ట్నర్ ఎవరనే దానిపై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది.
పఠాన్ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. సినిమా ముగింపు సమయంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. పఠాన్ టాక్‌తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్లో మంచి వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన పఠాన్ హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది.
పఠాన్‌లో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. జాన్ అబ్రహాం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిశాడు. టాప్ ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. కొన్ని సెంటర్లలో మిక్స్డ్ టాక్‌తో, మరికొన్ని సెంటర్లలో మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది పఠాన్.
పఠాన్ తాజా కలెక్షన్లపై తరణ్ ఆదర్శ్ ట్వీట్…
#Pathaan at national chains… Day 1… Update: 3 pm.#PVR: 9.40 cr #INOX: 7.05 cr #Cinepolis 3.90 cr
Total: ₹ 20.35 cr
EXTRAORDINARY.Better than #War [₹ 19.67 cr]. pic.twitter.com/Nx5pNtBN9E
— taran adarsh (@taran_adarsh) January 25, 2023