బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Sharukh Khan), సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand)కాంబినేషన్లో వస్తున్న సినిమా పఠాన్ (Pathaan). దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. జాన్ అబ్రహాం కీలక పాత్రలో నటిస్తున్నాడు. రిస్క్ తో కూడిన ప్రదేశాలు, పరిస్థితుల్లో షారుఖ్ టీజర్లో చేసిన స్టంట్స్ కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని అన్నాడు.
ఇండియాలో ఇప్పటివరకు రానట్వంటి భారీ యాక్షన్ సినిమా. సినిమా కోసం డిజైన్ చేసిన స్టంట్స్ కోసం షారుఖ్ ఖాన్ చేసే ప్రయత్నాలను చూసి టీమ్ సభ్యులు అంతా ఆశ్చర్యపోయారని, షారుఖ్‌లా ఎవరూ ఉండరని చెప్పాడు సిద్దార్థ్ ఆనంద్. సినిమా పట్ల షారుఖ్‌ఖాన్‌కు ఉన్న మక్కువ, డెడికేషన్, నిజాయితీని అర్థం చేసుకునేందుకు పఠాన్ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నానని అన్నాడు సిద్దార్థ్ ఆనంద్.
2023 జనవరి 25న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది పఠాన్ . యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో పఠాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ సినిమాలపై అంచనాలు అమాంతం పెంచేశాయి. మూడేళ్లకుపైగా విరామం తర్వాత షారుఖ్ కు పఠాన్ గ్రాండ్ కమ్ బ్యాక్ ఎంట్రీ ఇస్తుందా..? లేదా..? అనేది చూడాలి.
పఠాన్ టీజర్ ..
Read Also: Samantha | ఫైట్స్ అంటే చాలా ఇష్టం.. యశోదను ఎందుకు చూడాలో చెప్పిన సమంత
Read Also: Prakash Raj | కొత్త ప్రకాశ్‌రాజ్‌ను చూస్తారు.. రంగమార్తాండ సినిమాపై విలక్షణ నటుడు
Read Also: Sreenu Vaitla | డైరెక్టర్ శ్రీను వైట్ల ఫాం కేర్ టేకర్‌ను కాటేసిన పాము
Read Also: Karthi25 | వినూత్న టైటిల్‌తో కార్తి కొత్త సినిమా..!