ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. గౌతమ్ వాసుదేవమీనన్, ఎస్పీచరణ్ కీలక పాత్రధారులు.. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మాకా, సురేశ్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానున్నది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.
ఆదివారం ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచిందనీ, వరల్డ్ క్లాస్ లెవల్లో ఈ సినిమాలోని పతంగ్ పోటీల సీజీ ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాతో తామందరిదీ భావోద్వేగ ప్రయాణమని, కైట్ స్పోర్ట్స్ డ్రామా తీయడం తేలికైన విషయం కాదని, ప్రీతి పగడాల పేర్కొన్నారు. ఇంకా చిత్రబృందం కూడా మాట్లాడారు.