Ullozhukku Teaser | ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చి సంచలనాలు సృష్టించిన డాక్యుమెంటరీ ‘కర్రీ అండ్ సైనైడ్'(Curry & Cyanide) : ది జాలీ జోసెఫ్ కేస్. గతేడాది నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ డాక్యుమెంటరీ ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోవడమే కాకుండా గ్లోబల్ టాప్-10 స్ట్రీమింగ్ కంటెంట్లలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన క్రిస్టో టామీ మరో సంచలన మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
మలయాళ స్టార్ నటి పార్వతి తిరువోతు, సీనియర్ నటి ఊర్వశి ప్రధాన పాత్రలో క్రిస్టో టామీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఉళ్ళోజుక్కు(Ullozhukku). తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ గమనిస్తే.. కొత్తగా పెళ్లి అయ్యి అత్తారింటికి వచ్చిన పార్వతికి అక్కడ ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయి. అందరూ పార్వతినే ఎందుకు సందేహంగా చూస్తుంటారు అనేది సస్పెన్స్‌గా ఉంది. ఇక కర్రీ అండ్ సైనైడ్ లాగానే ఇది కూడా క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతున్నట్లు తెలుస్తుంది.
ఆర్ఎస్విపి, మాక్‌గఫిన్ పిక్చర్స్ బ్యానర్లపై రోనీ స్క్రూవాలా, హనీ ట్రెహాన్, అభిషేక్ చౌబే సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో షెబిన్ బెన్సన్, అర్జున్ రాధాకృష్ణన్, వీణా నాయర్, అలెన్సియర్ లే లోపెజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.