అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకుడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ పేరుతో కొత్త పాటను విడుదల చేశారు. ‘నువ్వు పెళ్లిచేసుకెళ్లిపోతే బంగార్రాజు మాకింకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు, నువ్వు శ్రీరాముడైపోతే బంగార్రాజు మాకింకెవ్వడు తీరుస్తాడు ముద్దుమోజు..వాసివాడి తస్సాదియ్యా’అంటూ హుషారుగా ఈ గీతం సాగింది. ఈ పాటను కల్యాణ్‌కృష్ణ రచించగా..మోహన భోగరాజు, సాహితి చాగంటి, హర్షవర్దన్ చావలి ఆలపించారు. ఇందులో నాగార్జున, నాగచైతన్య కలిసి స్టెప్పులేశారు. ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాస్ గీతంగా ఈ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చిత్రబృందం తెలిపింది. ఈ గీతానికి అనూప్‌రూబెన్స్ స్వరాల్ని అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: యువరాజ్, సంగీతం: అనూప్‌రూబెన్స్, నిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, స్క్రీన్‌ప్లే: సత్యానంద్, నిర్మాత: అక్కినేని నాగార్జున, కథ, దర్శకత్వం: కల్యాణ్‌కృష్ణ.