2011లో ‘లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది పరిణీతి చోప్రా. ప్రియాంక చోప్రా చెల్లెలుగా ఇండస్ట్రీకి పరిచయమైన పరిణీతి పలు హిట్ సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నది. పోయినేడాది ఎంపీ రాఘవ్ చద్దాను పెండ్లి చేసుకున్నది. కెరీర్లో జరిగిన కొన్ని సంఘటనలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నది. అందులో స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌పై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. షూటింగ్ సెట్స్‌లో రణ్వీర్ సింగ్ విచిత్రంగా ప్రవర్తిస్తారని పరిణీతి చెప్పింది. ‘విచిత్రమైన డిజైన్ల దుస్తులు వేసుకుంటారు. ఏంటి అని అడిగితే ఈరోజు ఇదే ఫ్యాషన్ అంటారు. సెట్స్‌లోకి ప్యాంట్ వేసుకోకుండా వచ్చి పక్కనే కూర్చునేవారు. ప్యాంట్ వేసుకోమని ఎవరైనా చెబితే అప్పుడు వెళ్లి వేసుకునేవారు.
రణ్వీర్ కారవాన్‌లోకి వెళ్లడానికి భయం వేసేది. ఒంటి మీద బట్టలు లేకుండా ఉండేవారు. అలా ఎందుకు తిరుగుతావు అని అడిగితే.. తనను అలా చూడటం వల్ల జీవితాలు మారిపోవు కదా అనేవారు. ఒక సినిమాలో రొమాంటిక్ సీన్ చేసే సమయంలో ప్యాంట్ లేకుండా సెట్లో కనిపించారు. నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పడంతో ప్యాంట్ వేసుకొని వచ్చారు’ అని చెప్పుకొచ్చింది పరిణీతి.