పార్థగోపాల్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. సూర్య జి.యాదవ్ దర్శకుడు. ఈ నెల 10న సినిమా విడుదల కానున్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించి చిత్రబృందాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత, పంపిణీదారుడు వాకాడ అప్పారావు, శివాజీరాజా, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. సస్పెన్స్, థ్రిల్ కలగలిసిన పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని హీరో, నిర్మాత పార్థగోపాల్ అన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు చెప్పారు.