పార్థాగోపాల్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. సూర్య జి.యాదవ్ దర్శకుడు. ఈ నెల 10న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో గురువారం ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఇది భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథాచిత్రమని, ప్రతి కటుంబానికీ ఈ కథ కనెక్టవుతుందని హీరో, నిర్మాత పార్థాగోపాల్ అన్నారు.
హృదయాలను కదిలించే ఉద్వేగాలు ఈ సినిమాలో ఉంటాయని, ఇది కేవలం సినిమా మాత్రమే కాదని, ఓ అనుభూతుల సమాహారమని దర్శకుడు సూర్య జి.యాదవ్ చెప్పారు. మేఘనారెడ్డి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి డీవోపీ: శివ ఆచంట, సంగీతం: పీఆర్.