ఢిల్లీ : వచ్చే నెలలో శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు గాను ఆ దేశ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టులో మధ్యప్రదేశ్ సీనియర్ స్పిన్నర్ సారాంశ్ జైన్ చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని జట్టులో సెలక్టర్లు.. దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న 33 ఏండ్ల సారాంశ్‌కు తొలిసారి జట్టులో చోటు కల్పించారు. ఆఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టుకు దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. గాయం కారణంగా తొలి టెస్టు నుంచి వాషింగ్టన్ దూరమవగా.. బుమ్రా, సుదర్శన్ సైతం సీవోఈ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తేనే ఫస్ట్ టెస్టులో పాల్గొంటారు.
టీమిండియా అసిస్టెంట్ కోచ్‌లు ర్యాన్ టెన్ దష్కటెతో పాటు టి.దిలీప్ కాంట్రాక్టులు ముగిశాయని, వాటిని పొడిగించబోమని బీసీసీఐ తెలిపింది. జట్టుకు కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా అసోంకు చెందిన సుభాదీప్ ఘోష్ ఎంపికయ్యే అవకాశాలున్నాయి.
భారత జట్టు: గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, జైస్వాల్, రిషభ్, సుదర్శన్, జురెల్, జడేజా, కుల్దీప్, మానవ్ సుతార్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్, గుర్నూర్, పడిక్కల్, సారాంశ్