సృష్టిలోని ఏడు లోకాల నేపథ్యంలో సోషియో ఫాంటసీ జోనర్లో దర్శకుడు సి.హెచ్.సుమన్ బాబు ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. దీనికి ‘పరకామణి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘దాదాపు 20కోట్ల వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం.
అద్భుతమైన గ్రాఫిక్స్ హంగులుంటాయి. ఇద్దరు ప్రముఖ హీరోలు నటిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. దర్శకుకు సుమన్‌బాబు రూపొందించిన తాజా చిత్రం ‘ఎర్రచీర’ డిసెంబర్ 20న విడుదల కానుంది.