Paradha Movie Teaser | గతేడాది టిల్లు స్క్వేర్(Tillu Square)తో బ్లాక్ బస్టర్ అందుకుంది అందాల భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran).ఇప్పుడు ఆమె లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పరదా’(Paradha). ఈ సినిమాకు లాక్డౌన్లో సినిమా బండి(Cinema Bandi Fame) అంటూ వచ్చి హిట్ అందుకున్న ప్రవీణ్ కాండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
టీజర్ చూస్తుంటే.. సంప్రదాయపు కట్టుబాట్లు మహిళలను ఎలా అణచివేస్తున్నాయి. ఎలా ఎదగకుండా అణగదొక్కుతున్నాయి.. వాటిని దాటి మహిళలు ఎలా ఎదుగుతున్నారు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. మలయాళ నటి దర్శన.. సంగీత ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ టీజర్‌ను మీరు చూసేయండి.