Panchayat Season 3 | ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో చిన్న వెబ్ సిరీస్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘పంచాయత్’. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం ఫన్ ఎంటర్టైనర్గా మంచి విజయన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రెండు సీజన్లు విడుదల కాగా ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో అదరగోట్టాయి. అయితే రీసెంట్గా సీజన్ 3 వస్తున్నట్లు ప్రైమ్ వీడియో ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త సీజన్ మే 28నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ట్రైలర్ వదిలింది.
ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగావకాశాలు లేక ఓ మారుమూల గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా జాయిన్ అయిన జితేంద్ర కుమార్ (అభిషేక్ త్రిపాఠి)కు అక్కడ ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయి అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఇక సీజన్ 3లో జితేంద్ర కుమార్ టాన్స్‌ఫర్ క్యాన్సిల్ అయ్యి మళ్లీ అదే గ్రామానికి పంచాయతీ సెక్రటరీగా వస్తాడు. ఈ క్రమంలోనే పంచయతీ ఎలక్షన్స్ వస్తాయి. అయితే ఈ ఎన్నికలలో అభిషేక్‌కు ఎదురయ్యే కొత్త అడ్డంకులు ఏంటి? వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. దీపక్ మిశ్ర దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో జితేంద్ర కుమార్, రఘువీర్ యాదవ్, నీనా గుప్తా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.