Prabhas | ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రభాస్ ఉన్నంత బిజీగా ఏ హీరో లేడేమో. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం అదే స్థాయిలో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లే. ఇక ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్-K’, ‘సలార్’ ప్రాజెక్ట్‌లతో పాటు మారుతితో హార్రర్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో ప్రోఫైల్‌లో సాగుతుంది. కమర్షియల్ హీరోగా గుర్తింపున్న ప్రభాస్.. హార్రర్ కాన్సెప్ట్ చేయడం.. అది కూడా మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తుండటంతో ప్రభాస్ అభిమానుల నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.
అయితే విమర్శలను పట్టించుకోకుండా ప్రభాస్ ఈ సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నాడు. మారుతి కూడా తన రెగ్యులర్ కామెడీ స్టైల్లో కాకుండా ఈ సారి కొంచెం యాక్షన్ టచ్ కూడా ఇవ్వబోతున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్ని వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్నవే. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు కూడా దాదాపు రెండు, మూడు వందల బడ్జెట్లతోనే తెరకెక్కాయి. తీరా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాలు సాధించాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆదిపురుష్’, షూట్ జరుపుకుంటున్న ‘ప్రాజెక్ట్-K’, ‘సలార్’ సినిమాల బడ్జెట్లు రూ.500 కోట్లకు పైమాటే అని టాక్.
అయితే మారుతి సినిమా మాత్రం లిమిటెడ్ బడ్జెట్లో తెరకెక్కుతుందట. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ వంద కోట్లకు తక్కువేనట. అంతేకాకుండా ఈ సినిమా కోసం ప్రభాస్, మారుతి రెమ్యునరేషన్ కూడా తీసుకోవడం లేదట. లాభాల్లో మాత్రం కొంత వాటా తీసుకోనున్నట్లు టాక్. అనవరసమైన సీన్లు, హెవీ గ్రాఫిక్స్ లేకుండా మారుతి ఈ సినిమాను పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట. షూటింగ్ కూడా కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే పూర్తవుతుందట.
హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రాజా డిలక్స్’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు. ‘రాజా డిలక్స్’ అనే థియేటర్ చుట్టు తిరిగే తాతా-మనవళ్ల కథతో ఈ సినిమా రూపొందనుందట. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో పాత కాలం నాటీ థియేటర్ సెట్ వేశారట. ఈ ఒక్క సెట్ కోసమే మేకర్స్ దాదాపు 6 కోట్లు ఖర్చుచేశారని సమాచారం. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్‌లు సెట్ అయ్యారు. మూడో హీరోయిన్గా ఇటీవలే అమిగోస్‌తో మెప్పించిన అశికా రంగనాథ్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇప్పటివరకు ఏ స్టార్ హీరోతో సినిమా చేయని మారుతి.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో సినిమా చేస్తుండటంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఒకింత భయంగానే ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా మారుతి తెరకెక్కించిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్‌ను మారుతి ఎలా హాండిల్ చేస్తాడో అనే డౌట్ అభిమానుల్లో మెదులుతుంది.