Zubeen Garg | ఇటీవల మరణించిన ప్రముఖ భారతీయ గాయకుడు జుబీన్ గార్గ్‌కు పాకిస్తాన్లో అరుదైన నివాళి లభించింది. పాకిస్తానీ రాక్ బ్యాండ్ ‘ఖుద్గర్జ్’ (Khudgharz) కరాచీలో నిర్వహించిన తమ కాన్సర్ట్‌లో జుబీన్ గార్గ్ పాడిన సూపర్ హిట్ పాట ‘యా అలీ’ (Ya Ali)ను ప్రదర్శించి అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా.. జుబీన్కి నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించింది.
బ్యాండ్ ఈ పాటను ఆలపిస్తున్నప్పుడు, కాన్సర్ట్కి హాజరైన ప్రేక్షకులందరూ ఉత్సాహంగా కోరస్ పాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన ఇరు దేశాల సరిహద్దులను చెరిపివేస్తూ సంగీతానికి బోర్డర్స్ లేవంటూ నిరుపించింది. ఈ వీడియోను ‘ఖుద్గర్జ్’ బ్యాండ్ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటూ కరాచీ నుంచి ప్రేమతో జుబీన్ గార్గ్ మీరు ఎల్లప్పుడూ మా ప్లేలిస్ట్‌లో ఒక భాగంగా ఉంటారు. ధన్యవాదాలు అని రాసుకోచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తూ సంగీతానికి సరిహద్దులు లేవని నిరుపించారు. జుబీన్ గార్గ్‌ని ప్రజలు ఎంతగా ప్రేమించారో ఆయనకు తెలిస్తే బాగుండు, ఆయన నిజమైన లెజెండ్ అని కామెంట్లు చేశారు. యా అలీ పాట.. 2006లో విడుదలైన బాలీవుడ్ చిత్రం గ్యాంగ్‌స్టర్ (Gangster) లోనిది. ఈ పాట గార్గ్‌కు దేశవ్యాప్తంగానే కాక, అంతర్జాతీయంగానూ గొప్ప పేరు తెచ్చిపెట్టింది.
A Pakistani band pays tribute to Zubeen Garg.
And a massive audience sings along. Beautiful to watch ❤️ pic.twitter.com/L11FUnWN04
— Parth MN (@parthpunter) October 6, 2025