Actor Shah Rukh Khan | బాలీవుడ్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన నటులలో షారుఖ్ ఖాన్ ఒకడు. ఆయన క్రేజ్ ప్రపంచమంతటా ఉంది. ఇప్పటి తరానికి షారుఖ్ అంటే నటుడుగానే తెలుసు కానీ.. తొంభై, రెండువేల దశకంలో ఆయనొక సంచలనం. ఆయన సినిమా వస్తుందంటే ఉత్తరాదితోపాటు దక్షిణాదిన కూడా పండగ వాతావరణం నెలకొనేది. ఆయన నటన, స్వాగ్ , యాటిట్యూడ్ అంటే పడిచచ్చిపోయేవారున్నారు. ముఖ్యంగా బాలీవుడ్లో ఒకప్పుడు అందగాడు ఎవరంటే టక్కున షారుఖ్ పేరే చెప్పేవారు. అలాంటి షారుఖ్‌ను అందంగా లేడని, ఆయనకు నటన రాదని పాకిస్తాన్ నటి మహ్నూర్ బలోచ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
షారుఖ్ పెద్ద అందగాడు కాదని, యాక్టింగ్ రాదని, రొమాంటిక్ పాత్రలు చేయలేరని మహ్నూర్ బలోచ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. కాకపోతే ఆయన మంచి వ్యక్తిత్వం, ఆయనలోని తేజస్సే ఆయనను సినీ పరిశ్రమలో ఒక పెద్ద హీరోగా నిలబెట్టాయని అభిప్రాయపడింది. అంతేగాక షారూఖ్ పెద్ద బిజినెస్ మ్యాన్ అని, ఆయనకు ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో బాగా తెలుసని వ్యాఖ్యానించింది. ఇండస్ట్రీలో అతనికంటే చాలా మంది అందంగా ఉండే అబ్బాయిలు ఉన్నారు. కానీ వారిని ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియక, తేజస్సు, చలాకీతనం లేక అలాగే ఉండిపోయారని వెల్లడించింది. ఈ వ్యాఖ్యలపై షారుఖ్ అభిమానులు మండిపడుతున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే మహనూర్ బలోచ్ ఇలా షారుఖ్‌పై కామెంట్స్ చేస్తుందని తెలుపుతున్నారు.
ఇక ఎన్నో ఏళ్ల తర్వాత పటాన్‌తో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ప్రస్తుతం అదే జోష్‌తో జవాన్‌ను పూర్తి చేస్తున్నాడు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్టటికే రిలీజైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేసింది. ఇక దీనితో పాటుగా రాజ్‌కుమార్ హిరానీతో డుంకి అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూఇంగ్ జరుపుకుంటుంది.