Padma Awards For Cinema Artists | 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సినీ రంగం నుంచి బాలకృష్ణతో పాటు, తమిళ నటుడు అజిత్ నటి శోభన, బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్థో పాటు తదితరులు ఈ అవార్డులు అందుకున్నారు. దీంతో వీరికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లవెత్తుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు రాజమౌళి సహ పలువురు సినీ ప్రముఖులు వీరికి విషెస్ తెలిపారు.
అయిదు దశాబ్దాలపైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకం. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీ బాలకృష్ణ గారు – హిందూపురం శాసన సభ్యుడిగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ గా ఎన్నో సేవలందిస్తున్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. పద్మ పురస్కారాలకు ఎంపికైన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
పవన్ కల్యాణ్
పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డికి నా అభినందనలు.. అలాగే పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన నందమూరి బాలకృష్ణ, అజిత్‌కుమార్, అనంత్ నాగ్, శేఖర్ కపూర్ జీ, ‘రుద్రవీణ’ చిత్రంలో సహనటి శోభనకు నా అభినందనలు. అర్జిత్ సింగ్, మాడుగుల నాగఫణి శర్మతో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ప్రతి ఒక్కరికి అభినందనలు.. వీరంతా అవార్డులకు అర్హులు
చిరంజీవి
ఈసారి తెలుగు వారికి 7 పద్మ అవార్డులు… పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన నందమూరి బాలకృష్ణకి హృదయపూర్వక అభినందనలు. భారతీయ సినిమాలో మీ ప్రయాణం నిజంగా ప్రశంసనీయం. అజిత్ సర్, పద్మభూషణ్ అవార్డు అందుకున్నందుకు అభినందనలు. తెరపై అలాగే తెర వెనుకాల మీరు చూపిన ఇంపాక్ట్ నిజంగా స్ఫూర్తిదాయకం. అలాగే, ఇతర ప్రముఖ తెలుగు ఇతర భారతీయ పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు.
రాజమౌళి
పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. కళ, సినిమా పట్ల మీకున్న డెడికేషన్‌కి ఈ అవార్డుకి మీరు నిజంగా అర్హులు.
మహేశ్
దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. కళా రంగానికి మీరు చేసిన విశేష కృషికి. అలాగే నటుడిగా, ఎమ్మెల్యేగా, క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా మీ సేవలకు నిజంగా ఈ గౌరవానికి అర్హులు.
సాయి ధరమ్ తేజ్
పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. చిన్నపిల్లాడి మనస్తత్వం.. నెట్లో సింహం అందరికీ సోదరుడు అంటూ నాని రాసుకోచ్చాడు.
నాని
దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. సినిమా, ప్రజా సేవకు మీరు చేసిన అసమానమైన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. నిజంగా ఈ గౌరవానికి మీరు అర్హులు.
మంచు విష్ణు