సత్యం రాజేష్, శ్రవణ్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘పాడేరు 12వ మైలు’. సుహాన కథానాయిక. ఎన్.కె. దర్శకత్వంలో గ్రంధి త్రినాథ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 6న సినిమా విడుదల కానుంది. సస్పెన్స్తోపాటు లవ్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయని, అన్ని వర్గాలకు నచ్చేలా సినిమా ఉంటుందని దర్శకుడు ఎన్.కె తెలిపారు.
సినిమా చాలా బాగా వచ్చిందని, తప్పకుండా ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉందని నిర్మాత గ్రంధి త్రినాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గడ్డం నవీన్, షేకింగ్ శేషు, ముకేష్ గుప్తా, కె.ఏ.పాల్రాము, సూర్య, సమీర్ చిట్టిబాబు, మురళి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: జి.అమర్.