వాసం నరేష్, ఆశ ప్రమీల జంటగా నటిస్తున్న సినిమా ‘ప్యాకప్’. పీజీపీ ప్రొడక్షన్స్ పతాకంపై పానుగంటి శరత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. జీవీఎస్ ప్రణీల్ దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత ఏఎం రత్నం అతిథిగా హాజరై హీరో హీరోయిన్లపై క్లాప్ ఇచ్చారు. ‘మా చిత్రంలో ప్రేమలో కొత్త కోణాన్ని చూపిస్తున్నాం. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తాం. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్తున్నాం’ అని దర్శకుడు జీవీఎల్ ప్రణీల్ తెలిపారు.